Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharman: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా సంక్రాంతి బరిలోనే తలైవర్ దిగుతున్నారంటే ఆ సందడే వేరు. సూపర్ స్టార్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’ను పొంగల్ 2027 బరిలో దించుతున్నారంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట తెగ ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి రేసులో ‘ధర్మన్’ లేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా 40 శాతం వరకు బ్యాలెన్స్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని చిత్ర బృందం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
దీనికితోడు భారీ స్థాయిలో సాగాల్సిన పోస్ట్ ప్రొడక్షన్, సిజిఐ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదట. వర్క్ ఏమాత్రం లేట్ కాకుండా ఉండేందుకు ప్రతి షెడ్యూల్ ముగియగానే సీజీ వర్క్ కోసం ఫుటేజ్‌ను పంపుతూ పనులను వేగవంతం చేస్తున్నారని టాక్. ఎలాంటి హడావుడి లేకుండా అవుట్‌పుట్ పక్కాగా తీసుకురావాలనే ఉద్దేశంతో సంక్రాంతి రేసు నుంచి సినిమాను తప్పించినట్లు సమాచారం. అయితే వేసవి కానుకగా ఏప్రిల్ మధ్యలో లేదా తమిళ నూతన సంవత్సరం సమయంలో సినిమాను తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ వచ్చిన వార్తల్లోనూ ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. నెల్సన్ డైరెక్షన్లో రానున్న స్పెషల్ ప్రాజెక్ట్ (KHxRK) కోసం మాత్రమే రజినీ – కమల్ కాంబో క్రేజ్‌ను వాడాలని భావిస్తున్నారట. సంక్రాంతికి మిస్సయినా.. కొత్త రిలీజ్ డేట్‌తో తలైవర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read
- The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
- Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ - జక్కన్న మూవీ!
- Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
తాజావార్తలు
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
-
Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!