Vishwak Sen Comments on Myanmar Incident: కుకీ, మొయితీ అనే రెండు వర్గాల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ లో ఒక దారుణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను మరో వర్గానికి చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ గా మారగా ఈ అంశం మీద దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ ఘటన మే 4వ తేదీన జరగగా ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. ఇక ఈ అంశం మీద సినీ, రాజకీయ వర్గాల వారు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశం మీద మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మణిపూర్‌లో ప్రజలు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, మహిళలను అగౌరవపరుస్తున్న ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయని విశ్వక్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Sakshi Dhoni: అందుకే తెలుగులో LGM.. అసలు విషయం చెప్పేసిన ధోనీ భార్య
ఈ బాధ కలిగించే ప్రవర్తనలు ప్రబలంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన వెంటాడే పరిణామాలను కలిగి ఉన్నందున వాటిని గుర్తించి పరిష్కరించాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని రాసుకొచ్చారు. మానవత్వం యొక్క నిజమైన అర్థం, అత్యంత ముఖ్యమైన మతం, తరచుగా విస్మరించబడటం నిరుత్సాహపరుస్తుందని విశ్వక్ పేర్కొన్నారు. సమాజం ఏ దిశగా పయనిస్తుందా అనే టెన్షన్ ను నేను నా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నానని, ఇలాంటి ముఖ్యమైన అంశాలు మీడియాలో గుర్తించబడనప్పుడు మరింత ఇబ్బందికరంగా అనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి గత కొద్దిరోజులుగా విశ్వక్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆయన బేబీ సినిమా కధ కూడా వినకుండా రిజెక్ట్ చేశాడని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిజానికి అసలు ఏం జరిగిందో తెలియదు కానీ ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Sad morning people :
The recent incidents in Manipur, where people are misusing their freedom and disrespecting women, are deeply saddening. I urge everyone to recognize and address these distressing behaviors, as they seem to be prevalent and have haunting consequences. It's…
— VishwakSen (@VishwakSenActor) July 24, 2023