Sakshi Dhoni: అందుకే తెలుగులో LGM.. అసలు విషయం చెప్పేసిన ధోనీ భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sakshi Dhoni Comments on Releasing LGM in Telugu: లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married) త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ‘ఎల్‌జీఎం’ ఈ సినిమాతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న రిలీజ్ అవుతున్న ఈ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్స్ విడుదల చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో.. నిర్మాత సాక్షి ధోని మాట్లాడుతూ “ సాధారణంగా మావారు ధోని, ఎప్పుడూ సర్‌ప్రైజ్‌లిస్తుంటారు, ఆయన్నుంచి వచ్చిన మరో సర్ప్రైజ్ ఇది అని అన్నారు. సాధారణంగా క్రికెట్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, మా వారికి అది ప్రొఫెషన్ అని అన్నారు. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంటర్‌టైన్మెంట్ కాబట్టి సినీ పరిశ్రమలోకి వచ్చామని పేర్కొన్న ఆమె ఇద్దరం చాలా సినిమాలు చూస్తామని అన్నారు. అది థియేటర్‌లో కావచ్చు.
Dimple Hayathi: ఎద అందాలను ఎరగా వేసి.. కుర్రాళ్లను చంపేస్తున్న డింపుల్
Also Read
ఓటీటీలో కావచ్చు విపరీతంగా సినిమాలు చూస్తామని అన్నారు. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చామని, ఇంకా మరెన్నో సినిమాలను చేయటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ‘ఎల్‌జీఎం’ సినిమాను తమిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్యలో అభిమానులున్నారు కాబట్టి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామని అన్నారు. తెలుగు సినిమాలను హిందీలోకి అనువాదం చేసి యూ ట్యూబ్‌లో రిలీజ్ చేసేవాళ్లు నేను వాటిని చూసేదాన్నని పేర్కొన్న ఆమె ముఖ్యంగా నేను అల్లు అర్జున్ సినిమాలన్నింటినీ చూశానని, నేను తనకు పెద్ద అభిమానినని అన్నారు. నేను స్టోరీ డిస్కషన్‌లో డైరెక్టర్‌తో మాట్లాడేదాన్నని పేర్కొన్న ఆమె ఎక్కువగా ఫీడ్ బ్యాక్ తీసుకుని మంచి ఔట్‌పుట్ కోసం డిస్కస్ చేసుకునేవాళ్లమని, అలా క్రియేటివ్ సైడ్ నా వంతు పార్ట్‌ను నేను తీసుకున్నానని అన్నారు. ఇదొక ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి కథ అని, సాధారణంగా మన రిలేషన్స్‌లో పొరపచ్చాలు వస్తుంటాయి వాటిని తిరిగి నిలబెట్టుకుటూ వెళుతుంటామని అన్నారు. మన లైఫ్‌లో రిలేషన్ షిప్స్ గురించి చెప్పే సినిమా ఇదని పేర్కొన్న ఆమె ఓ ఇండిపెండెంట్ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తన మనసులో ఎలా ఫీల్ అవుతుంటుందని అన్నారు. దానికి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందనే పాయింట్‌తో ‘ఎల్‌జీఎం’ సినిమాను తెరకెక్కించామని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!