Manchu Vishnu: మంచు విష్ణు చాలా గ్యాప్ తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఇక ఈ స్టేజిపై మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రేమతో వచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్ చెప్పిన విష్ణు సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పాడు. ముఖ్యంగా అనూప్ రూబెన్స్ సంగీతం చాలా బాగా అందించాడని, తన కూతుర్లు అరియనా, వివియానా లతో సాంగ్ పాడించడం అద్భుతంగా ఉందని చెప్పాడు. అక్టోబర్ 21 న సినిమా రిలీజవుతోంది.. ప్రేక్షకులందరూ సినిమా చూసి ఆదరించాలని కోరుకొంటున్నాను అని తెలిపారు.
ఇక హోస్ట్ గా వ్యవహరించిన ఆలీకి థాంక్స్ అని, ఇక ప్రభుదేవా అడగగానే వచ్చి సాంగ్ చేశారని, ఆ తర్వాత చెక్ ఇవ్వమని నాన్న మనిషిని పంపిస్తే తమ్ముడికి సాంగ్ చేస్తే అన్న డబ్బులు తీసుకోడని చెప్పండి అని చెప్పినట్లు తెలిపాడు. ఇక మోహన్ బాబు లో తనకు అన్ని ఇష్టమేనని చెప్పుకొచ్చిన విష్ణు ఆయనలో కోపం నచ్చదని చెప్పుకొచ్చాడు. ఇక తన తల్లి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంలో దిట్ట అని తెలిపిన విష్ణు.. తన భార్య తన కంటిచూపుతోనే బెదిరిస్తుందని చెప్పి నవ్వులు పూయించాడు.