Vikrant Rona రిలీజ్ డేట్ టీజర్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. “ఇది అద్భుతంగా ఉంది ! కిచ్చ సుదీప్ అడ్వెంచర్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ టీజర్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చిరు సోషల్ మీడియాలో “విక్రాంత్ రోనా” టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక సరికొత్త జోనర్ లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బండారితో పాటు చిత్రబృందానికి విషెస్ అందించారు. హిందీలో ‘విక్రాంత్ రోనా’ విడుదల తేదీ టీజర్‌ను ఈరోజు సల్మాన్ ఖాన్ విడుదల చేయనున్నారు. ఇక తెలుగులో విడుదలైన కొత్త టీజర్ లో చిన్న పిల్లలు ఓ డైరీ గురించి వెతకడం, వాళ్ళ చర్చలో బూచోడి గురించి రావడం ఆసక్తికరంగా ఉంది.
Read Also : 40 Years for Bangaru Kanuka : నలభై ఏళ్ళ ‘బంగారు కానుక’
కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా ఐదు విభిన్న భాషల్లో ఈ చిత్రం జూలై 28న 3డిలో విడుదల కానుంది. మేకర్స్ వ్యూహాత్మకంగా సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేసారు. దేశంలోని నలుగురు పెద్ద తారలు ఈ చిత్రానికి సపోర్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ మూవీని అరబిక్, జర్మన్, రష్యన్, మాండరిన్, ఇంగ్లీష్ భాషలలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ‘విక్రాంత్ రోనా’లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ కూడా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో, జాక్ మంజునాథ్ తన ప్రొడక్షన్ షాలిని ఆర్ట్స్‌పై నిర్మించారు. ఇన్వెనియో ఆరిజిన్స్‌కు చెందిన అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా ఉన్నారు.
This looks Superb! @KicchaSudeep 's adventure-thriller release date teaser లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. Director @anupsbhandari & entire team, BEST WISHES!#VikrantRonaJuly28 worldwide release in 3D @nirupbhandari @neethaofficial @Asli_Jacqueline @shaliniartss @ZeeStudios_ pic.twitter.com/L6affNJf14
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2022