Vikram: ధనుష్-కార్తీ-శివకార్తికేయన్ లకి షాక్ ఇచ్చిన విక్రమ్
యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, మల్టీ టాలెంటెడ్ హీరో ధనుష్, సౌత్ స్టార్ కార్తీలకి కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. వీళ్ల నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే మినిమమ్ గ్యారెంటీ అని అందరూ నమ్ముతారు. హోమ్లీ ఇమేజ్ ని ఎక్కువగా మైంటైన్ చేసే ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వార్ కి సిద్ధమయ్యారు. ఈ దీపావళి ఫెస్టివల్ కార్తీ, ధనుష్, శివకార్తీకేయన్ మధ్య వార్ కి కారణం అయ్యింది. శివ కార్తికేయన్ నటిస్తున్న సైన్క్ ఫిక్షన్ డ్రామా ‘అయలాన్’… భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని దీపావళికి రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఇదే సమయంలో ఇప్పటికే పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ధనుష్ దీపావళిని టార్గెట్ చేస్తూ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారి బడ్జట్ సినిమాపై ఇప్పటికే సాలిడ్ బజ్ ఉంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని ధనుష్ అగ్రెసివ్ గా ప్రమోట్ చెయ్యడం గ్యారెంటీ.
ఈ రెండు సినిమాలకి పోటీగా కార్తీ నటిస్తున్న ‘జపాన్’ సినిమా కూడా రిలీజ్ కానుంది. రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కార్తీ కంప్లీట్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. దీంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వార్ హీట్ ఎక్కింది, తమిళనాడులో ఉన్న థియేటర్స్ ఇద్దరు స్టార్ హీరోల రెండు సినిమాలకి మాత్రమే న్యాయం చెయ్యగలవు కాబటి ఈ మూడు సినిమాల్లో ఏది వాయిదా పడుతుందా అని ట్రేడ్ వర్గాలు ఆలోచిస్తూ ఉంటే నేను కూడా రెడీ అంటూ చియాన్ విక్రమ్ కూడా రంగంలోకి దిగాడు. విక్రమ్ నుంచి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ‘ధ్రువ నచ్చితరం’ సినిమా దీపావళికి రిలీజ్ కానుందనే మాట కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా రిలీజ్ రేస్ లోకి వస్తే దీపావళికి కోలీవుడ్ లో రచ్చ రచ్చ జరగడం గ్యారెంటీ. మరి నలుగురు హీరోలు తమ సినిమాలని ఒకేసారి రిలీజ్ చేస్తారా? లేక ఎవరైనా వాయిదా వేసుకుంటారా అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?