Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం కోబ్రా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 31 న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం అన్నిరాష్ట్రాలను చుట్టేసి అభిమానులతో సందడి చేస్తోంది. ఇక ఎండు హైదరాబాద్ లో కోబ్రా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో ఎన్నో అద్భుతమైన ప్రశ్నలకు విక్రమ్ మరెంతో అద్భుతంగా సమాధానం చెప్పుకొచ్చాడు. ఇక బాలీవుడ్ బాయ్ కాట్ ట్రెండ్ పై విక్రమ్ ఫన్నీ గా స్పందించాడు.
బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విక్రమ్ మాట్లాడుతూ.. “నాకు అర్ధం కావడం లేదు.. బాయ్ కాట్ అంటే ఏంటి..? మీరేం అడుగుతున్నారు. నాకు బాయ్ తెలుసు గర్ల్ తెలుసు. ఇంగ్లీష్ లో కాట్ అంటే కూడా తెలుసు ఈ బాయ్ కాట్ అంటే ఏంటి..?” అను నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇక అలా నవ్వుతు కాంట్రవర్సీ విషయం నుంచి సున్నితంగా తప్పించుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారే. అనవసరమైన వాటి గురించి మాట్లాడకుండా సినిమా గురించి మాత్రమే మాట్లాడి విక్రమ్ మంచి పని చేశాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ కోబ్రా చిత్రంతో ఈ కోలీవుడ్ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.