రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. సాహారవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత వేసుకుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసిన విజయ్. దాంతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ పూర్తి చేసేశారట.
లైగర్ షూటింగ్ కావడం .. నెక్స్ట్ ఈ రెండు సినిమాలను లైన్లో పెట్టనున్నాడట ఈ హీరో. ఇకపోతే శివ నిర్వాణ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ని రంగంలోకి దింపడానికి చూస్తున్నారట మేకర్స్. కియారా చాలాసార్లు తనకిష్టమైన హీరో విజయ్ దేవరకొండ, అతడితో నటించాలని ఉంది అని బాహాటంగానే చెప్పుకొచ్చింది. వీరిద్దరూ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలోనూ కనిపించారు. ఇక ఇప్పుడు విజయ్ సరసన నటించే అవకాశం వస్తే కియారా వదులుకుంటుందా..? లేక ఒడిసిపడుతుందా..? అనేది చూడాలి. ఇకపోతే ప్రస్తుతం ఈ భామ తెలుగులో చరణ్ సరసన శంకర్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది.