Vijayashanthi : నందూమరి కల్యాణ్ రామ్ హీరోగా.. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న సినిమా సన్నాఫ్ వైజయంతి. తల్లి, కొడుకులు కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సినిమా ఇది. ఇందులో విజయశాంతి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొన్న ఓ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా ముచ్చటైన బంధాలే పాటను చిత్తూరులో రిలీజ్ చేశారు. ఈ పాటను తల్లి, కొడుకుల బంధం నేపథ్యంలో తీర్చిదిద్దారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తుండగా.. హరిచరణ్ ఈ సాంగ్ పాడారు. రఘురామ్ లిరిక్స్ రాశారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలోకి రాబోతోంది. సాంగ్ లాంచ్ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో విజయశాంతి మాట్లాడారు.
Read Also : Off The Record : రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తంటాలు..?
‘ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇందులో కల్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటించారు. అతను ప్రతి ఒక్కరికీ సమానమైన గౌరవం ఇస్తుంటాడు. చాలా క్రమశిక్షణ ఉన్న నటుడు. అఫ్ కోర్స్.. సీనియర్ ఎన్టీఆర్ మనవడు కదా.. ఆ గుణాలు ఎక్కడకు పోతాయి. వాళ్ల తాతయ్య దగ్గరి నుంచి కల్యాణ్ రామ్ కు క్రమశిక్షణ వచ్చింది. ఈ సినిమా చేస్తున్నంత సేపు చాలా బాగా అనిపించింది’ అంటూ తెలిపింది విజయశాంతి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.