Vijaya Shanthi:ప్రముఖ నటి, బీజేపీ నేత విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మనసుకు నచ్చకపోతే ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తోంది. ఇలా ఎన్నోసార్లు విమర్శలు కూడా అందుకొంది. ఇక సినిమాల్లో విజయశాంతి, చిరంజీవి పెయిర్ గురించి చెప్పాలంటే.. వాళ్ళు నటిస్తున్నారా..? జీవిస్తున్నారా..? అన్న సందేహం రాకమానదు. అయితే ఎప్పుడైతే విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చిందో అప్పటినుంచి వీలు దొరికినప్పుడల్లా చిరుపై విమర్శలు చేస్తూనే ఉంటుంది. మొన్నటికి మొన్న లాల్ సింగ్ చద్దా సినిమా రిలీజ్ అప్పుడు కూడా చిరుపై విమర్శలు చేసింది.ఇక నేడు చిరు బర్త్ డే కావడంతో ఆమె గతంలో చేసిన విమర్శలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి.
చిరంజీవితో మీరు ఎన్నో సినిమాలు చేశారు.. వాటిని పక్కన పెడితే మీకెప్పుడైనా చిరంజీవిని వేలెత్తి చూపే సందర్భాలు ఎదురయ్యాయా..? అని అడుగగా నో అని చెప్పారు. ఒకరిని వేలెత్తి చూపాలంటే.. ఎదుటివారు ప్రజలకు న్యాయం చేయకుండా ఉండాలి.. వారిని పట్టించుకోనప్పుడు ఆటోమేటిక్ గా వేలెత్తి చూపిస్తాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని అందరు గోల చేస్తున్నప్పుడు ఏ ఒక్క హీరో కూడా వచ్చి పట్టించుకున్నది లేదు. సినిమాల్లో అది చేశాం.. ఇది చేశాం అని చెప్పుకొనేవారికి బయట ఏం చేసే గట్స్ లేవు. ఈ హీరోలందరూ ముసుగు దొంగలు. సినిమాల్లోనే హీరోలు.. బయట అలా ఉండరు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.