Varasudu: అఫీషియల్.. విజయ్ ‘వారసుడు’ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varasudu: దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్‌పై సందిగ్ధత వీడిపోయింది. గతంలో సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ మూవీ విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఇంకా రెండు రోజుల సమయమే ఉన్నా టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా వారసుడు తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడినట్లు నిర్మాత దిల్ రాజు అఫీషియల్‌గా ప్రకటించారు. తమిళంలో మాత్రం ఈనెల 11నే వారసుడు విడుదలవుతుండగా.. తెలుగులో మాత్రం ఈనెల 14న విడుదల చేస్తున్నట్లు వివరించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాతే సినిమాను రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించాడు. ఒక అడుగు వెనక్కి వేశాననే బాధ లేదని తెలిపాడు.
Read Also: Gold Rates High Live: బంగారం ధరల పెరుగుదల.. ఎందుకంటే?
Also Read
- Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్ లో మత్తెక్కించే దృశ్యాలు... ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ
- Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్ అంటూ కామెంట్స్!
- Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
- Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
ఈ సినిమాపై తమకు 100 శాతం నమ్మకం ఉందని.. గతంలో తమ బ్యానర్ నుంచి సంక్రాంతికి వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు, శతమానంభవతి, ఎఫ్ 2 సినిమాల మాదిరిగా వారసుడు కూడా విజయం సాధిస్తుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. వారసుడు మూవీ కూడా దిల్ రాజు బ్రాండ్ తరహాలో ఉంటుందన్నారు. కుటుంబ కథా చిత్రమే అయినా ఈ మూవీలో ఓ కొత్త పాయింట్ ఉంటుందని.. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఈ పాయింట్‌ను మాత్రమే గుర్తుంచుకుంటారని దిల్ రాజు అన్నారు. రెండు మాస్ సినిమాలు పోటీగా రిలీజ్ కానుండటంతోనే దిల్‌రాజు తెలుగు వెర్షన్ విషయంలో కొంత వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన వారసుడు సినిమాలో విజయ్ సరసన రష్మిక హీరోయిన్గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీకాంత్, శరత్‌కుమార్, కిక్ శ్యామ్, సంగీత , జయసుధ, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్ లో మత్తెక్కించే దృశ్యాలు… ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ
-
KTM India: జూన్ 1 నుంచి KTM బైక్స్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. ఏయే మోడళ్లపై ఎఫెక్ట్ అంటే?
-
Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్‌పై విమర్శలు..
-
Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్ అంటూ కామెంట్స్!
-
DK Shivakumar: గవర్నర్‌ను కలిసిన డీకే.శివకుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..