Varasudu: దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్‌పై సందిగ్ధత వీడిపోయింది. గతంలో సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ మూవీ విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఇంకా రెండు రోజుల సమయమే ఉన్నా టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా వారసుడు తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడినట్లు నిర్మాత దిల్ రాజు…