కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లియో సినిమాతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టాడు. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టిన లియో సినిమా విజయ్ బాక్సాఫీస్ సత్తా ఏంటో చూపించింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన మార్క్ చూపించడంలో కాస్త వీక్ అయినా కూడా విజయ్ తన ఆడియన్స్ ఫుల్ స్టామినాతో 600 కోట్లు వసూల్ చేసాడు. టాక్ బాగుంటే లియో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది. లియోతో మిస్ అయిన హిట్ ని ఈసారి క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కొట్టడానికి వస్తున్నాడు దళపతి విజయ్. దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా… జయరామ్, ప్రభుదేవా, యోగిబాబు, ప్రశాంత్, స్నేహ, లైలా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఎప్పటిలాగే వెంకట్ ప్రభు మ్యూజిక్ భద్యతలని యువన్ శంకర్ రాజాకి అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, థీమ్ మ్యూజిక్ ఇవ్వడంలో యువన్ స్టయిలే వేరు. క్రియేటివ్ గా కథ చెప్పడం, కథనంలో కావాల్సినన్ని ట్విస్ట్ లు పెట్టడం వెంకట్ ప్రభు స్టైల్ అఫ్ ఫిల్మ్ మేకింగ్. తన ప్రతి సినిమాకీ… వెంకట్ ప్రభు పాలిటిక్స్, వెంకట్ ప్రభు రీయూనియన్, వెంకట్ ప్రభు గేమ్ లాగా ఈసారి ఎలాంటి కొటేషన్ తో సినిమా చేస్తాడు అనే క్యూరియాసిటీతో విజయ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ త్వరలో దళపతి 68 ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. 2024 జులై 31న రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉన్న దళపతి 68 ఫస్ట్ లుక్ ని జనవరి 1న విడుదల చేసి ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేస్తారా లేదా అనేది చూడాలి.