Vijay Setupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి.. జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్మొదలుపెట్టిన మేకర్స్ .. తాజాగా తమిళ్ లో జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు షారుఖ్ ఖాన్ తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఇక ఈ ఈవెంట్ లో షారుక్ పై విజయ్ సేతుపతి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను ప్రేమించిన అమ్మాయి షారుక్ వలనే దూరమైంది అని చెప్పి షాక్ ఇచ్చాడు.
” షారుఖ్ ఖాన్ తో నటించడం.. ఎంతో అద్భుతంగా అనిపించింది. ఈ సందర్భంలో నేనొక విషయాన్ని చెప్పాలి. స్కూల్ లో చదువుకునేటప్పుడు నేనొక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను. ప్రేమించాను. వన్ సైడ్ లవ్. ఆ విషయం ఆమెకు చెప్పలేదు. అయితే ఆమె మాత్రం షారుఖ్ ఖాన్ ను లవ్ చేస్తున్నట్లు చెప్పింది. అతడినే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. దీంతో అప్పటినుంచి షారుఖ్ అంటే నాకు పగ.. ఆ పగను మొత్తం జవాన్ లో తీర్చేసుకున్నాను” అని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ వ్యాఖ్యలకు షారుఖ్ సమాధానమిస్తూ.. ” విజయ్ నాపై పగ పట్టలేడు.. ఎందుకంటే అతను నా అభిమాని” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.