టాలీవుడ్‌లో క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మళ్లీ ముచ్చటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించిన ఈ జంట, ఇప్పుడు మూడోసారి స్క్రీన్ షేర్ చేయనుంది.
Also Read : Alia Bhatt: తన కూతురు కోసం రూట్ మార్చిన అలియా భట్..
ఇప్పటి వరకు సమాచారం ప్రకారం, యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్-ఎమోషనల్ డ్రామా రూపొందుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్లో కనిపించడం, గత కొంతకాలంగా వీరి రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం, ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని ఇచ్చింది.
ఇక ఈ సినిమా కథ 1854 నుండి 1878 మధ్య జరిగిన ఓ నిజమైన సంఘటన ఆధారంగా రూపొందుతోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడే ఓ పల్లెటూరి యువకుడి పాత్రలో నటించనున్నారు. ఇది ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే పూర్తిగా భిన్నమైనది. సినిమాకు ఎమోషన్, యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. రాహుల్ సాంకృత్యాన్ ఇప్పటికే ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్ వంటి విభిన్న కాన్సెప్ట్‌లకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో కూడా ఆయన సృజనాత్మకతను గరిష్టంగా చూపించనారని టాక్.