Kingdom : నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ తెలిసి కూడా విజయ్ నే తమకు పవన్ కల్యాణ్ అంటూ చెప్పడం చర్చకు దారి తీసింది. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మూవీ చూసిన అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటూ చెప్పాడు. ఈ సినిమా గౌతమ్ వల్లే ఇంత బాగా వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. మూవీ సక్సెస్ మీట్ ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటూ మీడియా ప్రశ్నించగా నాగవంశీ సమాధానం ఇచ్చారు.
Read Also : Deva Katta : రాజమౌళి సినిమాతో నాకు సంబంధం లేదు.. దేవాకట్టా క్లారిటీ
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో చేశాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో చేశాం. కాబట్టి సక్సెస్ మీట్ ను ఏపీలోని భీమవరం లేదా ఏలూరులో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈవెంట్ కు పవన్ కల్యాణ్ వస్తున్నారా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. నాగవంశీ స్పందిస్తూ.. ‘లేదండి పవన్ కల్యాణ్ ను పిలవట్లేదు. ఇప్పుడు ఈయనే(విజయ్ దేవరకొండ) మాకు పవన్ కల్యాణ్ అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కవుతూనే వావ్ అనేశారు. కానీ ఇండస్ట్రీలో ఒక్కడే పవన్ కల్యాణ్ ఉంటాడని.. అది ఏపీ డిప్యూటీ సీఎం మాత్రమే అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ కల్యాణ్ స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరని.. అలాంటప్పుడు ఆయనను వేరే వాళ్లతో పోల్చడం సరికాదంటూ మండిపడుతున్నారు. మొత్తానికి నాగవంశీ చేసిన కామెంట్లు ఇప్పుడు రచ్చ లేపుతున్నాయి. నిన్ననే పవన్ కల్యాణ్ ను కింగ్ డమ్ టీమ్ వెళ్లి కలిసింది. ఇంతలోనే నాగవంశీ ఈ కామెంట్ చేయడం ఆశ్చర్యం.
Read Also : Kingdom : కింగ్ డమ్ పార్ట్-2 వచ్చేది అప్పుడే.. నాగవంశీ క్లారిటీ