Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ టైటిల్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేసింది. సత్యదేవ్ స్పెషల్ రోల్ చేశాడు. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీమ్.. ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. మూవీ టైటిల్ ను ముందుగా వేరే అనుకున్నారా అని ప్రశ్నించగా.. విజయ్ ఆన్సర్ ఇచ్చాడు.
Read Also : Kingdom : కుబేర కలెక్షన్లపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్
‘మేం ఈ సినిమాకు ముందుగా ‘దేవర నాయక’ అనే టైటిల్ అనుకున్నాం. కానీ అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవర మూవీ రావడంతో టైటిల్ ను కింగ్ డమ్ గా మార్చుకున్నాం. అనుకోకుండా మా సినిమా టీజర్ కు ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం.. అది బాగా హిట్ అవ్వడం కలిసొచ్చింది. ఈ మూవీ కోసం మేం కష్టపడ్డందుకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. దీని రెండో పార్టు అద్భుతంగా ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదు. త్వరలోనే కంప్లీట్ డీటేయిల్స్ చెప్తాం. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరో నటిస్తాడు. ఆ విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ఇక కింగ్ డమ్ రెండు రోజుల్లో బాగానే కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పుడు వీకెండ్ కాబట్టి సోమవారం వరకు కలెక్షన్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. రెండో వారంలోనూ మూడు రోజుల వీకెండ్ కలిసొచ్చే ఛాన్స్ ఉంది.
Read Also : Vijay Deverakonda : విజయ్ కోసం మారువేషంలో వెళ్లిన రష్మిక