Vijay Deverakonda : హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉందనే రూమర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇద్దరూ ట్రిప్పులకు వెళ్లడం, రెస్టారెంట్లకు వెళ్లడం చూస్తున్నాం. కాకపోతే ఎంత సీక్రెట్ గా వెళ్లినా ఇద్దరూ దొరికిపోతూనే ఉంటారు. ఇక తాజగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీపై రష్మిక ఎప్పటికప్పుడు స్పెషల్ గా ట్వీట్ చేస్తూనే ఉంది. మూవీ రిలీజ్ అయిన రోజున ‘మనం కొట్టినం’ అంటూ విజయ్ సక్సెస్ పై ఎమోషనల్ అయింది. అంతే కాకుండా మూవీని థియేటర్లలో చూడాలని ఉందంటూ ట్వీట్ చేసింది. ఆమె చెప్పినట్టే మూవీని కూడా చూసేసింది. కాకపోతే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు.
Read Also : Allu Arjun : తెలుగు సినిమా వెలుగుతోంది.. బన్నీ సంతోషం..
తాజాగా ఆ సీక్రెట్ ను నిర్మాగ నాగవంశీ బయట పెట్టాడు. విజయ్ దేవరకొండకు రష్మిక పెద్ద ఫ్యాన్. ఆమె కింగ్ డమ్ ను చూడాలని హైదరాబాద్ లోని ఓ ఫేమస్ థియేటర్ కు వెళ్లింది. కానీ సెక్యూరిటీ పరంగా ఆమెను రానివ్వలేదు. దీంతో భ్రమరాంబ థియేటర్ కు ఎవరికీ తెలియకుండా మారువేషంలో వెళ్లి చూసి వచ్చింది. ఆమెకు విజయ్ మీద అంత అభిమానం ఉంది అంటూ తెలిపాడు నాగవంశీ. దీంతో రష్మిక, విజయ్ పేర్లు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాయి. రష్మిక ఎప్పటికప్పుడు విజయ్ మీద తన ఇంట్రెస్ట్ ను బయట పెడుతూనే ఉంది. కానీ ఒక పాన్ ఇండియా హీరోయిన్ గా ఉండి మారువేషంలో విజయ్ కోసం వెళ్లింది అంటే ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు వీరిద్దరి ఫ్యాన్స్.
Read Also : 71 National Film Awards : జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ.. ఎవరికి ఎంత..?