Cinematographer vs. Director of Photography: సినిమాటోగ్రఫర్- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మధ్య తేడా ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు. ఫిల్మ్ మేకింగ్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫర్- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే వీరు ఏమేం చేస్తారు? అనే విషయం మీద తరచుగా గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది. ఈ పదాలు కాస్త దగ్గరగా అనిపించినా అవి ప్రత్యేకమైన విధులతో ఉండే రెండు విభిన్నమైన పనులు. అసలు సినిమాటోగ్రఫర్- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మధ్య తేడా ఏంటి అనే వివరాలు మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
సినిమాటోగ్రాఫర్ అంటే ఏమిటి?
సినీ నిర్మాణ ప్రక్రియలో సినిమాటోగ్రాఫర్ అనే వ్యక్తి ఒక కీలక పాత్ర పోషిస్తాడు. సినిమా యొక్క దృశ్య విజువల్స్ ను షూట్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం వారి బాధ్యత. లైటింగ్, కంపోజిషన్, కెమెరా మూవ్‌మెంట్, లెన్స్ ఎంపిక నుండి సినిమా మొత్తం లుక్ వరకు ప్రతి చిన్న అంశానికి సినిమాటోగ్రాఫర్‌లు బాధ్యత వహిస్తారు. సినిమా విజన్‌ని రూపొందించడానికి సినిమాటోగ్రాఫర్‌లు ఫోటోగ్రఫీ డైరెక్టర్‌తో కలిసి పని చేస్తారు. వారు కోరుకున్న విజువల్స్ క్యాప్చర్ చేయడానికి కెమెరాలు, లెన్స్‌లు, లైటింగ్ సహా ఇతర పరికరాలను ఉపయోగిస్తారు. సినిమాటోగ్రాఫర్‌లు దర్శకుడితో కలిసి కథకు సరిపోయే విజువల్ స్టైల్ రూపొందిస్తారు. ఈ విజువల్స్ సినిమా మొత్తం దృష్టికి అనుగుణంగా ఉండేలా సినిమాటోగ్రాఫర్ దర్శకుడితో కలిసి పని చేస్తారు. సినిమా యొక్క విజువల్స్ రూపొందించడానికి సినిమాటోగ్రాఫర్లు బాధ్యత వహిస్తారు. విభిన్న రూపాలను క్యాప్చర్ చేయడానికి వేర్వేరు లెన్స్‌లు, లైటింగ్ అలాగే కెమెరా యాంగిల్స్‌ని ఉపయోగిస్తారు. సినిమా కలర్ గ్రేడింగ్‌కు సినిమాటోగ్రాఫర్లు బాధ్యత వహిస్తారు. సినిమాటోగ్రాఫర్లు CGI లేదా డిజిటల్ ఎఫెక్ట్స్ వంటి స్పెషల్ ఎఫెక్ట్‌లను ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకోవడానికి దర్శకుడితో కలిసి పని చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ ప్రక్రియకు సినిమాటోగ్రాఫర్లు కూడా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. సినిమాటోగ్రాఫర్‌లు సౌండ్ మిక్సింగ్, మ్యూజిక్ ఎంపికలను కూడా పర్యవేక్షించవచ్చు. మొత్తంమీద, చిత్ర నిర్మాణ ప్రక్రియలో సినిమాటోగ్రాఫర్ ఒక ముఖ్యమైన భాగం అని చెప్పక తప్పదు.
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఏమిటి?
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ లేదా ఫోటోగ్రఫీ డైరెక్టర్ సినిమా విజువల్స్ కి ప్రొఫెషనల్ బాధ్యతలు తీసుకుంటారు. ఆయనే కెమెరా సహా లైటింగ్ విభాగాలకు అధిపతిగా ఉంటారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీలు ప్రతి షాట్‌కు కెమెరా అలాగే లెన్స్ కలయిక, లైటింగ్, కలర్ సహా ఎక్స్‌పోజర్‌ను ఎంచుకుంటారు. అలాగే ఫైనల్ అవుట్ ఫుట్ కి కూడా వారు బాధ్యత వహిస్తారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సృజనాత్మకంగా, సాంకేతికంగా దర్శకుడి దృష్టిని అర్థం చేసుకుని ది బెస్ట్ ఇస్తారు. సెట్‌లో ఉన్నప్పుడు, ప్రతి షాట్‌కు అత్యుత్తమ పరికరాలు, లైటింగ్‌ను నిర్ణయించడానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కెమెరా ఆపరేటర్, గాఫర్ అలాగే కీ గ్రిప్‌తో సన్నిహితంగా పనిచేస్తారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రతి షాట్ కూర్పు, యాంగిల్, ఫ్రేమింగ్ గురించి దర్శకుడు మరియు కెమెరా ఆపరేటర్‌తో చర్చిస్తారు. ప్రతి సన్నివేశానికి లైటింగ్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీదే.