Vijay Deverakonda : విజయ్ దేవరకొండ అంటే స్టార్ హీరో. ఒక్కో సినిమాకు కోట్లలో తీసుకుంటాడు. ఒక్క యాడ్ చేసినా రెండు కోట్లకు తక్కువ తీసుకోడు. ఇప్పుడు ఆయన చేసిన కింగ్ డమ్ మూవీ కోసం రూ.30 కోట్ల దాకా తీసుకున్నాడు. అలాంటిది ఆయన నటించిన అర్జున రెడ్డి కోసం ఎంత తీసుకుంటాడు.. ఎంత లేదన్నా అప్పుడున్న రేంజ్ ప్రకారం కనీసం మూడు, నాలుగు కోట్లు అయినా తీసుకోవాలి కదా. కానీ ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ వింటే అంతా షాక్ అవుతారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ మూవీ గురించి ఇప్పటికీ ఏదో ఒక మీమ్ కనిపిస్తూనే ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీని ఉలిక్కి పడేలా చేసిన మూవీ అది.
Read Also : Kingdom : ఎన్టీఆర్ అన్న వల్లే టైటిల్ మార్చాను.. విజయ్ క్లారిటీ
ఆ మూవీ చేసే వరకు విజయ్ కు పెద్దగా గుర్తింపు లేదు. ఆ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సునామీ సృష్టించింది ఈ సినిమా. అలాంటి మూవీ కోసం విజయ్ కేవలం రూ.5లక్షలే తీసుకున్నాడంట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే బయటపెట్టాడు. నేను అర్జున్ రెడ్డి మూవీ కోసం కేవలం రూ.5లక్షలే తీసుకున్నా. ఆ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. దాన్ని వేలం వేస్తే రూ.25లక్షల దాకా వచ్చాయి. వాటిని నా అభిమానుల కోసం ఖర్చు పెట్టాను. మంచి పనుల కోసం ఖర్చు చేస్తే చాలా సంతోషం వేస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాతనే నా రెమ్యునరేషన్ పెరిగింది అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. అయితే ఒక హీరో పాత్ర చేసిన విజయ్.. అర్జున్ రెడ్డి కోసం అంత తక్కువ తీసుకోవడమేంటని అంతా షాక్ అవుతున్నారు.
Read Also : Kingdom : కుబేర కలెక్షన్లపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్