Site icon NTV Telugu

Virosh : విజయ్ ‘ఐస్‌క్రీమ్స్’ వెనుక రష్మిక.. ప్రేమకు బీజం ఇలా పడిందా?

Rashmika Vijay Devarakonda Weeding

Rashmika Vijay Devarakonda Weeding

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, అభిమానులకు స్వీట్లు పంచుతూ తమ సంతోషాన్ని చాటుకుంటున్న ఈ జంట వెనుక ఒక అందమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. ఒకప్పుడు కేవలం సహనటులుగా ఉన్న వీరిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది? అసలు విజయ్ ప్రతి ఏడాది తన పుట్టినరోజున ఐస్‌క్రీం ట్రక్కులు తిప్పే సంప్రదాయానికి ప్రేరణ ఎవరు? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సుమారు ఏడేళ్ల క్రితం ‘గీత గోవిందం’ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ కథకు పునాది పడింది, మే నెల ఎండల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో పనిచేసే వారందరూ తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు, ఆ సమయంలో రష్మిక మందన్న తన సొంత ఖర్చుతో సెట్లోని సిబ్బంది అందరికీ ఐస్‌క్రీంలు తెప్పించారు. చమటలు కక్కుతూ పనిచేస్తున్న కార్మికుల ముఖాల్లో ఆ ఐస్‌క్రీం తింటున్నప్పుడు కనిపించిన తృప్తి, చిరునవ్వు విజయ్ దేవరకొండ మనసును గట్టిగా తాకాయి.

Also Read :ViRosh : విరోష్.. రిసెప్షన్ కు వారికి నో ఎంట్రీ..

అప్పట్లో ‘నోటా’ సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ తన లైఫ్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. “సెట్లో అందరూ ఐస్‌క్రీంలు తింటూ నవ్వుతూ కనిపిస్తే ఏంటని అడిగా, రష్మిక మేడమ్ ఇప్పించారని చెప్పారు. ఆ చిన్న పనిలో ఎంత సంతోషం ఉందో అప్పుడు అర్థమైంది, నా పుట్టినరోజు కూడా ఎండాకాలమే వస్తుంది కదా.. నేను కూడా ఎందుకు ఇలా చేయకూడదు?” అని ఆయన అలా ట్రక్స్ తిప్పడం మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు. రష్మిక ఇచ్చిన ఆ చిన్న ప్రేరణను విజయ్ ఒక గొప్ప సంప్రదాయంగా మార్చుకున్న విజయ్ అప్పటి నుంచి ప్రతి ఏటా తన పుట్టినరోజున హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐస్‌క్రీం ట్రక్కులను తిప్పుతూ వేలాది మందికి చల్లని తీపిని పంచుతున్నారు. కేవలం ఒక నటిగా కాకుండా, తోటి మనుషుల పట్ల రష్మికకు ఉన్న ఆదరణే విజయ్‌ను ఆమె వైపు ఆకర్షించేలా చేసిందని చెప్పవచ్చు.

Also Read :Mana Shankar Varaprasad Garu: 109 సెంటర్లలో 50 రోజులు.. సరికొత్త రికార్డు

అలా ఐస్‌క్రీం ముచ్చట్లతో మొదలైన వీరి పరిచయం, ఆ తర్వాత కాలంలో గాఢమైన ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, వ్యక్తిగత ఎదుగుదలలో తోడుగా ఉంటూ వచ్చిన ఈ జంట ఇప్పుడు ఒక్కటయ్యారు. ఆనాడు సెట్లో రష్మిక పంచిన ఐస్‌క్రీంల తీపి, నేడు వారి పెళ్లి సందర్భంగా పంచుతున్న స్వీట్ల రూపంలో రెట్టింపు సంతోషాన్ని ఇస్తోంది. ఈ జంట జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Exit mobile version