Kushi: అక్టోబర్ 1 నుంచి ఓటీటీలోకి వచ్చేస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. పర్ఫెక్ట్ లవ్ స్టోరీగా ప్రమోషన్స్ జరుపుకున్న ఖుషి సినిమాకి సాంగ్స్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాయి. ఖుషి టైటిల్ సాంగ్, ఆరాధ్య సాంగ్ విన్న తర్వాత ఖుషి సినిమా విజయ్ దేవరకొండ-సమంత కెరీర్స్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. శివ నిర్వాణ లవ్ స్టోరీ పాయింట్స్ ని చాలా కూల్ గా టచ్ చేస్తాడు, ఖుషి సినిమాలో కూడా ఆడియన్స్ ఇదే ఎక్స్పెక్ట్ చేసారు. పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఖుషి సినిమా మొదటి రోజు క్లీన్ హిట్ అనే టాక్ ని సొంతం చేసుకుంది. డే 1 సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఒక సినిమా మొదటి సోమవారానికి ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రోజులు గడిచే కొద్దీ ఖుషి సినిమా సూపర్ హిట్ నుంచి హిట్, యావరేజ్, బిలో యావరేజ్, లాస్ వెంచర్… ఇలా గ్రాఫ్ పడుతూ వచ్చింది.
ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి కలెక్షన్స్ లో ఇంత డ్రాప్ కనిపించలేదు. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఓవర్సీస్ లో, నైజాం, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఖుషి సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యింది. కొన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ కూడా రాబట్టిన ఖుషి సినిమా కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే నష్టాలని మిగిలించింది. ఆ ఏరియాలో ఖుషి సినిమా దాదాపు 10-12 కోట్ల నష్టాల్ని మిగిలించిందని సమాచారం. ఒక్క ఏపీలో లాస్ రాకుండా ఉండి ఉంటే ఖుషి సినిమా క్లీన్ హిట్ గా నిలిచేది. కొత్త సినిమాల విడుదలతో ఖుషి థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యింది. అగ్రిమెంట్ ప్రకారం ఖుషి సినిమా అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. కూల్ గా వెళ్లిపోయే సినిమా కాబట్టి ఓటీటీలో ఖుషి ఎంత సక్సస్ అవుతుందో చూడాలి.
Also Read
- AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
- Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
- Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
- Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!