Vijay Devarakonda: క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ వరల్డ్ వైడ్ ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా అలుపు సొలుపు లేకుండా మూవీ టీమ్ ఇండియా అంతా ప్రమోషన్స్ జరుపుతోంది. ఇదిలా ఉంటే.. ఉత్తరాది వారికీ ఇప్పటికే సుపరిచితుడైన విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో దూకుడు పెంచాడు. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 18 ప్లస్ మిలియన్ ఫాలోవర్స్ ను పొందగా, విజయ్ దేవరకొండ అతని వెనుకే నిలిచాడు.
తాజాగా విజయ్ దేవరకొండకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 17 మిలియన్స్ కు చేరింది. అయితే.. ట్విట్టర్ లో మాత్రం ఈ రౌడీ హీరో కాస్తంత వెనకబడి ఉన్నాడు. అక్కడ విజయ్ దేవరకొండకు 3.1 మిలియన్ ఫాలోవర్సే ఉన్నారు. బట్.. ‘లైగర్’ మూవీ విడుదల తర్వాత అక్కడా విజయ్ దేవరకొండ రచ్చ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా.. ఉత్తరాది స్టార్స్ కు పోటీగా దక్షిణాది హీరోలు కూడా మిలియన్స్ కొద్ది ఫాలోయర్స్ ను పొందుతుండటం విశేషమే!