Vijay Deverakonda : విజయ్ దేవరకొండా.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda As A Chief Guest For Keedaa Cola Pre-release Event: దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం మూడో చిత్రం కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం అయింది. 2వ తేదీన యుఎస్ఎ, కొన్ని ఇతర ప్రాంతాలలో ప్రీమియర్లు ప్రదర్శించేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, ప్రమోషన్ మెటీరియల్ కూడా సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ దగ్గర పడడంతో రేపు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. విజయ్ కి మొదటి హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ మూడో సినిమాకి యూత్‌లో ఒక రేంజ్ క్రేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ రావడం హాట్ టాపిక్ అవుతోంది.
CM KCR: కామారెడ్డిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక విజయ్ దేవరకొండ ప్రజన్స్ ఈవెంట్‌ను మంచి హిట్‌గా మార్చి సినిమాకు ఎడిషనల్ బజ్‌ని సంపాదించడంలో సహాయపడుతుందని మేకర్స్ నమ్ముతున్నారు ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ కు జనం పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం వరదరాజులు తాతగా, చైతన్యరావు వాస్తుగా, రాగ్ మయూర్‌గా లంచమ్‌గా, నాయుడుగా తరుణ్, సికిందర్‌గా విష్ణుగా, జీవన్‌కుమార్‌గా జీవన్, రవీంద్ర విజయ్, షాట్స్‌గా రఘురామ్‌గా కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్ ఎజె ఆరోన్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఉపేంద్ర వర్మ ఎడిటర్ కాగా ఆశిష్ తేజ పులాల ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్, తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ అందించారు. కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన కీడా కోలా విజి సైన్మ మొదటి ఫీచర్-లెంగ్త్ ప్రొడక్షన్ గా నిలవనుంది.
అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది, అదేమంటే నిజానికి విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ ఇద్దరూ ఒకేసారి హిట్ కొట్టారు. విజయ్ దేవరకొండకు అది హీరోగా మొదటి హిట్. అప్పటి వరకు నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయనని నమ్మి తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమా చేశారు. వారి కష్టం ఫలించింది, పెళ్లిచూపులు చిన్న సినిమాగా మొదలై పెద్ద హిట్ అయింది. ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి హిట్లు పడడంతో పాటు లైగర్, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలు చేస్తూ పాన్ ఇండియా అప్పీల్ తెచ్చుకున్నాడు దేవరకొండ. తరువాత తమ్ముడిని లాంచ్ చేయడమే కాదు బేబీ లాంటి సినిమాతో ఆయన కూడా హిట్ కొట్టాడు. ఇక తరుణ్ కూడా కాళీగా ఏమీ లేడు, ఈనగరానికి ఏమైంది అనే యూత్ ఫుల్ సినిమా చేసి దానితో కల్ట్ హిట్ కొట్టడమే కాదు నటుడిగా కూడా మారాడు. తరుణ్ హీరోగా ఒక సినిమా చేస్తుంటే విజయ్ దేవరకొండ దాన్ని ప్రొడ్యూస్ చేసి కొంతవరకు సపోర్ట్ చేశాడు. ఇప్పుడు తరుణ్ మూడో సినిమా ఈవెంట్ కి విజయ్ చీఫ్ గెస్ట్ గా పిలవడం, ఆయన రావడం పెద్ద విషయం కాదు కానీ ఆయన ఆ రేంజ్ కి వెళ్లడమే అసలైన సక్సెస్ అంటున్నారు విజయ్ అభిమానులు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!