Vijay Deverakonda and Samantha’s Kushi title song released: విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఖుషి విడుదలకు సిద్ధం అవుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న క్రమంలో ఈ సినిమా యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 1న విడుదల కాబోతోన్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి. ఇప్పటికే నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ వచ్చి అందరినీ మెస్మరైజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఖుషి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఖుషి అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ఇప్పుడు అభిమానులను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటోంది.
Bro-RRR: బ్రో రిలీజ్ రోజునే ట్రెండింగ్లో ఆర్ఆర్ఆర్.. ఎందుకో తెలుసా?
నా రోజా నువ్వే పాటకు సాహిత్యం అందించి ఆకట్టుకున్న శివ నిర్వాణ ఈ పాటకు కూడా సాహిత్యం అందించగా మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు. ఇక హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన ఈ బాణీ ఎంతో వినసొంపుగా ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సాంగ్ లో ఉన్న విజువల్స్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నీట్ గా ఉన్నాయి. ఇక ఇప్పటికే ఖుషి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేయగా ఇప్పటికీ ఇన్ స్టాగ్రాం రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. రెండో పాట ఆరాధ్య సైతం ఆకట్టుకోగా ఇప్పుడు ఈ ఖుషి కూడా చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు.