క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ ‘లైగర్’. అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాక్సింగ్ సూపర్ స్టార్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఆగస్ట్ 25న ఈ సినిమా వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఆ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో ఇప్పటికే మొదలెట్టేశారు కూడా. ఇదిలా ఉంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సెట్‌ను ‘లైగర్’ చిత్ర బృందం సందర్శించింది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌పై స్పెషల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. తమ సినిమా కోసం ఇద్దరు సూపర్ స్టార్ల ఆశీస్సులు తీసుకుంది ‘లైగర్’ టీమ్. ఇదే సమయంలో ఇద్దరు సూపర్ స్టార్స్ ‘లైగర్’ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. విశేషం ఏమంటే… చిరు ‘గాడ్ ఫాదర్’ మూవీలో పూరి జగన్నాథ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. తాజాగా తాను ‘గాడ్ ఫాదర్’ సెట్ లో చిరు, సల్మాన్ ను కలిసిన ఫోటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Megastar @KChiruTweets sir & @BeingSalmanKhan sir –
Your blessings and love for #Liger means the world to us!
My respect and love always ❤️ pic.twitter.com/uts0kcY4L3
— Vijay Deverakonda (@TheDeverakonda) August 1, 2022