సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణాలో సినిమా టికెట్ ధరల పెంపుపై స్టార్ హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఉదయం చిరంజీవి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం నూటికి నూటొక్క శాతం సినీ పరిశ్రమను పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తోందంటూ ట్వీట్ చేశారు. “నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను… తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ” అంటూ విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధరల విషయంలో థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలను ముప్పుతిప్పలు పెడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినీ పరిశ్రమకు అండగా ఉంటూ అభయహస్తం అందిస్తోంది. టికెట్ ధరలను పెంచాలన్న టాలీవుడ్ సినీ పరిశ్రమ అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొత్త జీవోను కూడా జారీ చేశారు. సదరు జీవో ప్రకారం జీఎస్టీ మినహా ఏసీ థియేటర్లకు కనీస టిక్కెట్ ధర రూ.50, గరిష్టంగా రూ.150గా, మల్టీప్లెక్స్‌లలో ధర రూ. 100+GST, గరిష్టంగా రూ.250+GST తో ధరలను నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిక్లైనర్ సీట్లకు రూ. 200 + జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ. 300 + జీఎస్టీ టిక్కెట్‌కు రూ. 5 (ఎసి) మరియు టిక్కెట్‌కు రూ. 3 (నాన్ ఎసి) నిర్వహణ ఛార్జీని వసూలు చేయడానికి థియేటర్లకు అనుమతి లభించడంపై సెలెబ్రిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read
How to make an industry prosperous 101
Cannot thank the Telangana Govt. enough for always looking to increase health and prosperity of the economy! @TelanganaCMO @KTRTRS @YadavTalasani
I love my govt.
The Telugu Film industry – one of the biggest in the country.. is thankful 🤍 pic.twitter.com/2SW0R0S9y1— Vijay Deverakonda (@TheDeverakonda) December 25, 2021
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!