మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ శనివారం చేసిన ట్వీట్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. వీరు తమ తమ ట్వీట్స్ తో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అటు ఎపి గవర్నమెంట్ కు సందేశాలను పంపగలిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో పెద్ద రగడ జరుగుతోంది. జీవో 35ను అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తే… కొంత మంది ఎగ్జిబిటర్స్ కోర్టుకు వెళ్ళి సింగిల్ జడ్జ్ తీర్పుతో దానిపై స్టే తీసుకు వచ్చారు. అయితే…
తెలంగాణాలో సినిమా టికెట్ ధరల పెంపుపై స్టార్ హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఉదయం చిరంజీవి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం నూటికి…