Vijay Devarakonda : సమంతను ‘ఖుషి’ చేస్తోన్న విజయ దేవరకొండ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అందాల తార సమంత కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పేరును ప్రకటిస్తూ.. మేకర్స్ నేడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విజయ్-సమంత నటిస్తున్న ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరును ఖరారు చేశారు చిత్రయూనిట్. ఒక ఎపిక్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్లో ధృవీకరించారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక మనోహరమైన వైబ్‌తో.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా కనిపిస్తున్నారు.
‘ఖుషి’ నిజంగా హ్యాపీ కలర్‌ఫుల్ రొమాన్స్‌గా ఉండబోతోందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ, సమంతల మధ్య కెమిస్ట్రీ పోస్టర్లోనే కనిపిస్తోంది. అయితే ఈ సినిమా.. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జయరామ్, సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య లు ఈ సినిమాలో నటిస్తున్నారు.
Also Read
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- JanaNayagan : విజయ్ 'జననాయగన్'.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
- Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..