రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీలో బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న విషయం విదితమే.దీంతో విజయ్ బాలీవుడ్ స్టార్ ల లిస్ట్ లో కలిసిపోయాడు. ఇటీవల మరో ప్రముఖ నిర్మాత బర్త్ డే పార్టీలో లైగర్ టీమ్ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇక మరోసారి విజయ్ బాలీవుడ్ పార్టీలో మెరవనున్నాడు. ఈరోజు కరణ్ జోహార్ బర్త్ డే. ఈ నేపథ్యంలోనే ఈ రాత్రి పార్టీని కరణ్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నాడట. ఇక ఈ పార్టీకి బాలీవుడ్ బడా స్టార్లు అందరు రానున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి విజయ్ కు మాత్రమే ఆహ్వానం అందిందని సమాచారం. ఇక విజయ్ తో పాటు ఈ ఆహ్వానాన్ని నేషనల్ క్రష్ రష్మిక కూడా అందుకోవడం విశేషం. అయితే ఈ జంట గురించి ఎప్పటినుంచో సోషల్ మీడియా లో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ ప్రేమ పక్షులని, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నదని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కరణ్ పార్టీ కి ఈ జంటను మాత్రమే పిలవడానికి కారణం ఏంటబ్బా అని అని అందరు బుర్రలు బద్దలుకొట్టుంటున్నారు. మరి ఈ పార్టీలో ఈ జంట ఎలా మెరవనుందో చూడాలి.