‘గీతాగోవిందం’ చిత్రంతో ప్రేక్షకులకు లవ్ బర్డ్స్ లా మారిపోయారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా అభిమానులకు ఆనందమే.. మేమిద్దరమే మంచి స్నేహితులమే అని చెప్పుకొని వీరు తిరుగుతున్నా.. వీరి మధ్య ఇంకేదో ఉందని నెటిజన్లు నొక్కి వక్కాణిస్తున్నారు. బయట ఈ జంట ఎక్కడ కనిపించినా కెమెరాలకు పనిచెప్తున్నారు మీడియా వారు. ఇక తాజగా ఈ రౌడీ జంట ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ షూటింగ్ ముంబైలో జరుగుతున్న విషయం తెల్సిందే.. రష్మిక సైతం పుష్ప తరువాత తాను ఒప్పుకున్నా బాలీవుడ్ సినిమాల కోసం ముంబైలో మకాం వేయడానికి సిద్దమయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం బాంద్రా రెస్టారెంట్ కు రష్మికతో కలిసి డిన్నర్ కు వెళ్లి కెమెరాకు దొరికారు. ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నఈ రౌడీ జంట ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.దీంతో వీరి మధ్య నిజంగానే ఇంకేదో ఉంది.. అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.