రెండు మూడు రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం గురించి ఒక్కో వార్త పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ జంట ఇప్పటికే ఇంటి వరకు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుందని, ఫిబ్రవరి 2025 లో జరగనుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మీడియాతో మాట్లాడుడిన విజయ్ తన ప్రేమ, పెళ్లి, జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడారు.
Also Read : Alia Bhatt : డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి అసలు కారణం షేర్ చేసిన అలియా భట్ ..
కొన్నేళ్లుగా రష్మికతో తన సంబంధం గురించి వస్తున్న వార్తలపై తొలిసారిగా విజయ్ దేవరకొండ స్పందించారు. డేటింగ్ గురించి ప్రశ్నించగా, “అవును.. రష్మికతో రిలేషన్‌లో ఉన్నాను” అంటూ క్లియర్‌గా అంగీకరించారట. ప్రేమపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన విజయ్.. “నేను షరతులు (కండిషన్స్) లేని ప్రేమను నమ్మను. ప్రేమలో ఎప్పుడూ అంచనాలు ఉంటాయి. అందుకే షరతులు లేని ప్రేమను నమ్మను. అలాంటి ప్రేమ ఎక్కువ రోజులు నిలవదు కూడా’ అంటూ వ్యాఖ్యానించారట. అంతే కాదు “వివాహం తర్వాత మహిళలకు కొంచెం కష్టం కావచ్చు. కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనం చేసే పని పై ఆధారపడి ఉంటుంది. పెళ్లి నా కెరీర్‌కి ఎలాంటి ఆటంకం కాద” అని చెప్పారు. ఇటీవల తనలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ, “ఇప్పుడే నిజంగా జీవించడం అంటే ఏమిటో నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు, రష్మిక, స్నేహితులతో గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తాను. ఇంతకాలం బిజీ లైఫ్‌లో వారిని నిర్లక్ష్యం చేశాను. ఇకపై ఆ శాడ్‌నెస్ ఉండదు” అని తెలిపారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.