Vijay Devarakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఏది చేసిన ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇక సోషల్ మీడియా లో దాన్ని అభిమానులు ట్రెండ్ చేయడం అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. తాజాగా విజయ్ సినిమాలోని ఒక డైలాగ్ ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జన్తగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం సినిమా విజయ్- పరుశురామ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ స్టార్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. అందులో విజయ్ చెప్పిన డైలాగ్ .. ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి? అని చెప్తూ.. విలన్స్ ముందు ఐరన్ రాడ్ ను వంచుతూ కనిపిస్తాడు.
Varun- Lavanya: వరుణ్- లావణ్య శుభలేఖ చూసారా.. ఎలా ఉందో..?
ఇక ఇప్పుడు ఆ ఐరన్ డైలాగ్ వైరల్ గా మారింది. తాజాగా ఆ డైలాగ్ ను విజయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు. ఇంటర్నెట్ లో ఏం నడుస్తోంది .. అని అంటే.. ఐరనే వంచాలా ఏంటీ అనే డైలాగ్ నడుస్తోంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇది ఎంత ఫేమస్ అయ్యింది అంటే.. ఐరనే వంచాలా ఏంటీ అనే పేరును చాలామంది నిర్మాతలు టైటిల్ గా రిజిస్టర్ చేయించే ఉద్దేశ్యంలో ఉన్నారట. ఇదే కదా నిజమైతే.. విజయ్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఇది అయినా ఆశ్చర్యం లేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఒక డైలాగ్ ఈ రేంజ్ లో ఫేమస్ అవ్వడం అనేది చాలా రేర్ అని చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఇదే టైటిల్ తో విజయ్ ప్రేక్షకుల ముందుకు వస్తాడేమో చూడాలి.