Vijay Antony Daughter Meera Postmortem Completed: తమిళ కంపోజర్, నటుడు విజయ్ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. విజయ్ ఆంటోని 16 ఏళ్ల కుమార్తె మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒకరకంగా మీరా మరణ వార్తతో తమిళ పరిశ్రమ మేల్కొంది. సోషల్ మీడియాలో ఆమెకు నివాళులర్పించేందుకు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా 12వ తరగతి చదువుతున్న క్రమంలో ఆమె ఒత్తిడికి గురై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మీరాకు పోస్టుమార్టం నిర్వహించి, పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె మృతదేహాన్ని చెన్నైలోని అల్వార్‌పేటలోని ఆమె నివాసంలో ఉంచారు, అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన వారు నివాళులర్పించారు. ఇక ప్రస్తుతానికి పోస్టుమార్టం పూర్తి కాగా రిపోర్ట్ వచ్చేందుకు సమయం పట్టనుందని అంటున్నారు.
Sapta Sagaralu Dhati Trailer: గుండెలు పిండేందుకు రెడీ అయ్యారు కాస్కోండి!
ఇక ప్రాధమికంగా అయితే ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు డాక్టర్లు గుర్తించారు. ఇక ఈరోజు సాయంత్రం కావడంతో ఆమె అంత్యక్రియలు రేపు జరపనున్నట్టు సన్నిహితులు వెల్లడించారు. ఇక విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ నటుడి కుటుంబంలో విషాదం నెలకొంది. చైన్నైలోని అల్వార్‌పేటలోని వారి నివాసంలో మంగళవారం తెల్లవారుజామున మీరా ఉరివేసుకుని కనిపించింది. ఇక ఆమెను గమనించి ఆసుపత్రికి తరలించేలోపు ఆమె తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు వెల్లడించారు. మీరా చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. ఆమె నివాసంలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ మాత్రం లభించలేదు. ఇక తన కూతురు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని మార్చిలో విజయ్ ఆంటోని భార్య చేసిన పాత ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.