Sapta Sagaralu Dhati Trailer Released by Nani: రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా రిలీక్ అయి కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించగా సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకు వచ్చి ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న ఈ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. “సప్త సాగర దాచే ఎల్లో మొదట కన్నడలో విడుదల చేశాం, అయితే ఈ సినిమాని పాన్ ఇండియా విడుదల ఎందుకు చేయలేదని చాలామంది అడుగుతున్నారని అన్నారు.
Bandla Ganesh: చీము నెత్తురు ఉన్న ఉద్యోగులు బాబు కోసం నెల రోజులు ధర్నాలు చేయాలి !
కొన్ని సినిమాలను మనం తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాటంతట అవే పయనిస్తాయని, ఈ సినిమాని మేం ఎంతగానో నమ్మామని అన్నారు. చార్లీ సినిమా కర్ణాటక తర్వాత తెలుగులోనే బాగా ఆడింది, అందుకే నేను ఈ ప్రాంతాన్ని సినిమా భూమిగా భావిస్తా, ఇక్కడ సినిమాని ఒక సంస్కృతిగా చూస్తారని అన్నారు. నాక్కూడా సినిమానే జీవితం, సినిమానే దేవుడు. చార్లీ సినిమాని ఆదరించి, ఇక్కడ సప్త సాగర దాచే ఎల్లో విడుదలకు బాటలు వేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలని పేర్కొన్న ఆయన దర్శకుడు హేమంత్ కి ఇది మూడో సినిమా అని ఈ మూడు సినిమాలు కూడా కన్నడలో మంచి విజయం సాధించాయని అన్నారు. ఇక మరోపక్క ‘సప్త సాగరాలు దాటి’ చిత్ర ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అనిపిస్తోంది. మను అనే యువకుడికి అతని ప్రేయసికి మధ్య వచ్చే ఎడబాటు సన్నివేశాలను చూపించారు. ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.