Vijay Antony : విజయ్ ఆంటోనీ హీరోగా తన డైరెక్షన్ లోనే వచ్చిన బిచ్చగాడు ఓ సెన్సేషన్. దానికి సీక్వెల్ గా ఇప్పటికే సెకండ్ పార్ట్ వచ్చింది. మూడో పార్టు ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దానిపై హీరో విజయ్ ఆంటోనీ క్లారిటీ ఇచ్చారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాను అనే ప్రచారాన్ని ఖండించారు. ఫేమ్ ఉన్నంత మాత్రాన రాజకీయాలకు తాను సెట్ కాను అని తేల్చేశారు.
Read Also : Priyanka Chopra : ‘వర్జినిటీ… ముఖ్యం’.. కామెంట్స్ నేను చేయలేదు..
‘నా డైరెక్షన్ లో మరిన్ని సినిమాలు కూడా వస్తాయి. ఈ మూవీ తర్వాత బిచ్చగాడు-3 ఉంటుంది. ఇప్పటికే దాన్ని స్టార్ట్ చేశాం. అది కూడా నేనే డైరెక్ట్ చేస్తున్నాను. 2027లో అది రిలీజ్ అవుతుంది. స్క్రిప్ట్ పనులు ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే అన్ని డీటేయిట్స్ ఇస్తాం. మార్గన్ మూవీ ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనే నమ్మకం ఉంది. కన్నప్ప మూవీకి మాకు పోటీ లేదు. ఆ మూవీ పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీకి సీక్వెల్ గురించి మూవీలోనే క్లారిటీ ఇచ్చాం అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.
Read Also : Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..