Vijay and Mrunal Dance in Kalyani Vachha Vachha Song goes Viral: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి అంటూ ప్రేక్షకులను, తన అభిమానులను ఖుషి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన కల్యాణి వచ్చా వచ్చా సాంగ్.. ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. తాజాగా ఈ పాట వీడియో సాంగ్ విడుదల అయింది. గ్రాండ్ విజువల్స్ తో.. కమ్మనైనా సంగీతంతో మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది.
Saranya: స్టార్ నటిపై ఏడేళ్ల శిక్ష పడే కేసు.. పార్కింగ్ కోసం ఇంత రచ్చ చేశారా?
పాటలో వధూవరులుగా విజయ్ దేవరకొండ, మృణాల్ కనిపించగా… వారి డ్యాన్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉంది. ఈ మధ్య కాలంలో విజయ్ ఈ రేంజులో డ్యాన్స్ చేయడం ఇదే అని చెప్పవచ్చు. చివరి సినిమా ఖుషిలో సింపుల్ స్టెప్పులతో ఆకట్టుకోగా.. ఇందులో మాత్రం సూపర్ డ్యాన్స్ స్టెప్స్ తో అలరించారు. ఈ పాటలో మృణాల్, విజయ్ జంట, వారి మధ్య కెమిస్ట్రీ నేచురల్ గా ఉంది. అసలే పెళ్లిళ్ల సీజన్… ఇక ఈ పాట అన్ని పెళ్లి మండపాల్లో మోత మోగడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ అన్నట్లే కనిపిస్తుంది. ఇక ఈ పాట విషయానికి వస్తే… అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. మంగ్లీ, కార్తీక్ అలపించారు. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాకు గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించగా.. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వేసవి కానుకగా ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది.