A Police Complaint Against Actress Saranya Ponvannan Became Hot Topic: తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా తల్లి పాత్రలు పోషించే నటి శరణ్య పొన్వన్నన్ మీద ఆమె పక్కింట్లో ఉంటున్న ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మ అంటే ఆమెలా ఉండాలి అనేలా తల్లి పాత్రాలు చేస్తూ సినీరంగంలో దూసుకుపోతున్న ఆమె ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. అసలు విషయం ఏమిటంటే నటి శరణ్య పొన్వణ్ణన్ చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్‌లో నివసిస్తున్నారు. ఆమె ఇంటి పక్కనే శ్రీదేవి అనే మహిళ నివసిస్తోంది. శ్రీదేవి ఇంటి గేటు దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుంది. కాగా, నిన్న సాయంత్రం శ్రీదేవి తన ఇంటి గేటు తెరవగా ఆ సమయంలో శరణ్య పొన్వన్నన్ కారు ఆమె డోర్ బయట పార్క్ చేసి ఉంది. శ్రీదేవి ఇంటిని తాకేలా శరణ్య కారు ఉందని, ఈ కారణంగానే శరణ్య పొన్వన్నన్ కి శ్రీదేవి కుటుంబానికి మధ్య వాగ్వాదం మొదలైంది.
Harish Shankar: పవన్ ఒప్పుకోవాలేగాని తుప్పు రేగ్గొడతామంటున్న హరీష్ శంకర్
ఈ వాగ్వాదం జరగడంతో శరణ్య కుటుంబం శ్రీదేవి ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించినట్లు సమాచారం. శరణ్య, ఆమె కుటుంబం తమ ఇంట్లోకి చొరబడి తనను అసభ్య పదజాలంతో దూషించారని, చంపేస్తామని బెదిరించారని శ్రీదేవి ఆరోపించింది. ఈ ఘటనపై విరుగంపాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించిన శరణ్యపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరింది. దీంతో శ్రీదేవి విరుగంపాక్కం పోలీస్ స్టేషన్‌లో శరణ్య పొన్వణ్ణన్ సహా ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందిస్తూ శరణ్య పొన్వన్నన్ ఫ్యామిలీ కూడా రిపోర్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. శ్రీదేవి అందించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇరువర్గాలను విచారిస్తున్నారు.
ఈ ఘటన సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. కొన్ని నెలల క్రితం తమిళ సినిమాలో పార్కింగ్ అనే సినిమాలో కార్ పార్కింగ్ సమస్య వల్ల రెండు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య గురించి చూపించారు. అలాంటి ఘటనే శరణ్య పొన్‌వణ్ణన్‌కు ఎదురైందని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. నటి శరణ్య 1987లో కమల్ హాసన్ నటించిన నాయగన్ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. ఈ స్థితిలో అమీర్ దర్శకత్వంలో 2005లో వచ్చిన రామ్ సినిమా ఆమెకు టర్నింగ్ పాయింట్ గా మారింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో అమ్మ పాత్రలో నటించి తనదైన ముద్ర వేసుకుంది. ముఖ్యంగా రఘువరన్ బీటెక్ సినిమాలో ఆమె పాత్రతో తెలుగు వారికీ కూడా దగ్గరైంది.