#Thalapathy67: దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో సెకండ్ సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయ్యింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని విజయ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ ఫాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… #Thalapathy67 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న #Thalapathy67 సినిమా ఏవీఏం స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పెద్దగా హడావుడి లేకుండా, ఫోన్స్ ని స్టూడియోలోకి అనిమతించకుండా మేకర్స్ సైలెంట్ గా #Thalapathy67 పూజా కార్యక్రమాలని పూర్తి చేశారు. పూజా కార్యక్రమాలు పూర్తియిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా, లోకేష్ ప్రోమో షూటింగ్ కి వెళ్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 6న ఫోటోషూట్, డిసెంబర్ 7 నుంచి 9 వరకూ ప్రోమోని షూట్ చేయనున్నాడు లోకేష్ కనగారాజ్. కోలీవుడ్ హిస్టరీలోనే అంత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ ముంబైలో జరిగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందనుందట.
‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలని లింక్ చేసి ఒక యూనివర్స్ గా మార్చాడు లోకేష్ కనగారాజ్. ఈ యూనివర్స్ లోకి విజయ్ ని తెస్తాడు, #Thalapathy67 సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి ఆలోచనలని తలకిందులు చేస్తూ, లోకేష్ #Thalapathy67 సినిమాని స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నాడట. దీని వల్ల కమల్ హాసన్, సూర్య, కార్తి, విజయ్ లని ఒకే సినిమాలో చూడాలి అనుకున్న సినీ అభిమానులు డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అయితే విక్రమ్, రోలెక్స్, డిల్లి కథలోకి విజయ్ ని తీసుకోని రావడం కన్నా విజయ్ కే ఒక సెపరేట్ యూనివర్స్ క్రియేట్ చేయడం బెటర్ అని లోకేష్ భావిస్తున్నాడట. విజయ్, లోకేష్ ల కలయికలో వచ్చిన ‘మాస్టర్’ సినిమా కూడా #LCUతో సంబంధం లేని ప్రాజెక్ట్. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయ్ సాదించలేదు.