బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజా చిత్రం ‘జల్సా’ ట్రైలర్ రిలీజ్ అయింది. మార్చి18న ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్‌ను విడుదల చేస్తూ ‘కల్పితం కంటే నిజం వింతైనది!’ అంటూ ట్వీట్ చేసింది విద్యాబాలన్. ఇందులో మీడియా ఛానెల్‌కు ఎడిటర్‌గా నటిస్తోంది విద్యాబాలన్. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో విద్యా రాజకీయ నాయకుల అకృత్యాలను బహిర్గతం చేసే పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ప్రమాదానికి గురైన యువతి…