యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సెకండ్ ఔటింగ్ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గత మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మూవీ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో ఓపెన్ అయిన ఈ మోషన్ పోస్టర్ “వస్తున్నా” అనే డైలాగ్ తో ఎండ్ అయ్యింది. పాన్ ఇండియా రిలీజ్ అవ్వనున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ కి కూడా ఎన్టీఆర్ స్వయంగా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. దీంతో ‘ఎన్టీఆర్ 30’ సినిమా టాక్ అఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. అప్పటినుంచి నందమూరి అభిమానులు ‘ఎన్టీఆర్ 30’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మార్చ్ చివరలో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయిన ఈ మూవీ ముహూర్తం రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ మధ్య గ్రాండ్ గా జరిగింది.
Read Also: Bollywood: చిత్ర పరిశ్రమలో విషాదం టాలెంటెడ్ డైరెక్టర్ మృతి…
ఈ ముహూర్తం ఈవెంట్ లో కొరటాల శివ ‘ఎన్టీఆర్ 30’ గురించి మాట్లాడుతూ “ఎన్టీఆర్ 30 కథ, భారతదేశ సముద్ర తీరంలోని, ఒక ఫర్బిడన్ లాండ్ లో జరుగుతుంది. ఆ నేలపైన జంతువులకన్నా ఎక్కువగా రక్షులల్లాంటి మనుషులు ఉంటారు. ఎవరు ఎవరికీ భయపడరు. చావుకి కూడా భయపడని వాళ్లు ఒకడికి భయపడతారు. అది నా అన్న ఎన్టీఆర్ కి…” అంటూ స్పీచ్ ఇచ్చాడు. కొరటాల శివ మాటలని ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ కి అటాచ్ చేసి కొత్త మోషన్ పోస్టర్ చేసి రిలీజ్ చేశారు. ఈ కొత్త మోషన్ పోస్టర్ మొత్తం కొరటాల శివ వాయిస్ ఓవర్ తో ఉండగా, ఎండ్ లో మాత్రం ‘వస్తున్నా’ అనే ఎన్టీఆర్ వాయిస్ తో ఎండ్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘ఎన్టీఆర్ 30’ మోషన్ పోస్టర్ ని జక్కన్న వారసుడు ‘ఎస్ ఎస్ కార్తికేయ’ షేర్ చేస్తూ ముహూర్తం రోజు నుంచే గూస్ బంప్స్ ఇస్తున్నారు. కొరటాల శివ పవర్ ఫుల్ స్టొరీ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నా తారక్ అన్నా అంటూ కార్తికేయ ట్వీట్ చేసాడు. ఎన్టీఆర్ కి రాజమౌళిలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో కార్తికేయ, ఎన్టీఆర్ కూడా అంతే క్లోజ్ గా ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ ఇంటర్వూస్ సమయంలో కూడా ఎన్టీఆర్, కార్తికేయతో జరిగే ఫన్ ఎలా ఉంటుందో చెప్పాడు.
Goosebumps on the muhurtham day itself!!🔥🔥🔥🤙🤙🤙
Can’t wait to see Siva garu’s powerful story…..Very excited about this one! @tarak9999 Annaaaa❤️❤️❤️@anirudhofficial #JanhviKapoor @NTRArtsOfficial @YuvasudhaArts #NTR30 pic.twitter.com/3oWhsLtslj
— S S Karthikeya (@ssk1122) March 23, 2023