బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, ఎడిటర్ ప్రదీప్ సర్కార్ మరణించాడు. 67 ఏళ్ల వయసులో ముంబై లోని హాస్పిటల్ లో ‘డయాలసిస్’ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రదీప్ సర్కార్ మరణించాడు అనే వార్త బాలీవుడ్ ని కుదిపేసింది. హిందీ చిత్ర పరిశ్రమ అంతా ప్రదీప్ సర్కార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విదు వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ లో రైటర్ గా వర్క్ చేసిన ప్రదీప్ సర్కార్ మొదటిసారి మున్నాభాయ్ MBBS సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేసాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారిన ప్రదీప్ సర్కార్, 2005లో దర్శకుడిగా మరి ‘పరిణీత’ సినిమా తెరకెక్కించాడు. ఈ మూవీ మ్యూజికల్ హిట్ అయ్యింది కానీ బాక్సాఫీస్ దగ్గర సో సో గానే ఆడింది. 2005 నుంచి 2010 వరకూ ‘లగా చునేరి మే దాగ్’, ‘లఫంగే పరిందే’ సినిమాలని చేసాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దీంతో ప్రదీప్ సర్కార్ నాలుగేళ్ల గ్యాప్ తీసుకోని 2014లో ‘మర్ధాని’ సినిమా చేసాడు.
Read Also: Viral: కోడలా మజాకా.. పెళ్లికి ముందే ఇలా వుంటే పెళ్లైతే..
రాణీ ముఖర్జీ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా మంచి పేరు తెచ్చింది. ఇక్కడి నుంచి ప్రదీప్ సర్కార్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తూ ప్రదీప్ సర్కార్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎక్కువ శాతం జీ 5కే వెబ్ సీరీస్ లు చేసిన ప్రదీప్ సర్కార్ చివరగా 2022లో ‘దురంగా’ వెబ్ సీరీస్ చేసాడు. మరణించే ముందు వరకూ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పని చేస్తూనే ఉన్న ప్రదీప్ సర్కార్ అంత్యక్రియలు ఈరోజు సాయంతం నాలుగు గంటలకి శాంటాక్రూజ్ హిందూ క్రిమిటోరియంలో జరగనున్నాయి. బాలీవుడ్ వర్గాలు ‘దాదా’ అని ప్రేమగా పిలుచుకునే ప్రదీప్ సర్కార్ ఆకస్మిక మరణం హిందీ చిత్ర పరిశ్రమకి తీరని లోటుగానే మిగిలింది.