VenkyAnil3 : వెంకీ మామ కోసం రంగంలోకి ‘రమణ గోగుల’
- వెంకీ హీరోగా వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం
- దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి
- స్పెషల్ సాంగ్ పాడిన రమణ గోగుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత దర్శకుడు రమణ గోగుల ఇప్పటి యూత్ కు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఓ 20 ఏళ్ల కిందట తన మ్యూజిక్ తో రమణ గోగుల చేసిన సెన్సేషన్ రాతల్లో చెప్పలేనిది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే వంటి సాంగ్స్ తో అప్పటి యూత్ ను ఉర్రుతలూగించాడు రమణ గోగుల. మ్యూజిక్ అందించడమే కాకుండా స్వయంగా ఆలపించేవారు రమణ గోగుల. పవర్ స్టార్ తో బద్రి, తమ్ముడు, వెంకీ తో లక్ష్మి, రెబల్ స్టార్ తో యోగి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించారు రమణ గోగుల.
Also Read : SK : శ్రీమతికి శివకార్తికేయన్ స్వీట్ సర్‌ప్రైజ్.. వీడియో వైరల్
Also Read
- IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
- RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
- Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
- Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రమణ గోగుల మరోసారి తన స్వరాన్ని వినిపించబోతున్నారు. అవును ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో ఆసక్తిని రేకిత్తిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్మొదెలెట్టారు. అందులో భాగంగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని గోదారి గట్టు మీద అంటూ సాగే పాటను రమణ గోగుల ఆలపించనున్నారు. ఈ పాటకి, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. త్వరలోనే ఈ పాటని విడుదల చేయనున్నారు. కాగా వెంకీ నటించిన లక్ష్మీ సినిమాకు చివరిగా సంగీతం అందించారు రమణ గోగుల. 18 ఏళ్ల తర్వాత వెంకటేశ్ – రమణ గోగుల కలయికలో రానున్న ఈ సాంగ్ పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. వెంకీకి జోడీగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!