Venkatesh: చిన్నోడితో పోటీ.. పెద్దోడు ఏమన్నాడంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ పవర్ ప్యాక్డ్ గా కట్ చేసిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 న రిలీజ్ కానుంది. దానికి ముందు రోజే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక వెంకటేష్- మహేష్ బాబు మధ్య పోటీ జరగనుంది. వీరిద్దరూ కలిసి.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించారు. పెద్దోడు- చిన్నోడు గా వీరి నటనకు తెలుగు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిన్నోడితో పోటీ పడడం గురించి పెద్దోడు స్పందించాడు.
Prithviraj Sukumaran: సలార్ లో వరదరాజా.. వణికించేటట్టు ఉన్నాడే
Also Read
- Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
- Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
- Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
- Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
గుంటూరు కారం తో పోటీ పడుతున్నారు.. ఎలా ఫీల్ అవుతున్నారు అన్న ప్రశ్నకు వెంకీ మామ మాట్లాడుతూ.. “పెద్దోడు వస్తే సూపర్ హిట్.. చిన్నోడు వస్తే సూపర్ హిట్.. ఇద్దరు కలిసి వచ్చినా సూపర్ హిట్.. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ కొట్టిన విషయం గుర్తు లేదా..? అభిమానులు.. పెద్దోడి సినిమాకు వెయిట్ చేస్తున్నారు.. చిన్నోడి సినిమాకు వెయిట్ చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇద్దరం.. ఒకేసారి రావడం.. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. రెండు సినిమాలు మంచి హిట్ అందుకుంటాయి” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ అందుకుంటుందో .. లేక రెండు సినిమాలు హిట్ అందుకుంటాయో చూడాలి.
తాజావార్తలు
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!