Venkatesh: వెంకీ మామ నోటి వెంట బూతు పురాణం.. వినలేం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh: ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాలు లేని, ఎటువంటి ఫ్యాన్ వార్ లేని ఏకైక హీరో విక్టరీ వెంకటేష్.. వెంకీ సినిమా అంటే అందరి హీరో ఫ్యాన్స్ సైతం ఎంకరేజ్ చేస్తారు. టాలీవుడ్ మొత్తానికి వెంకీ మామ ఒక్కడే. సినిమా ఏదైనా వెంకీ మామ దిగనంత వరకే.. కామెడీ, యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్.. అన్ని జోనర్స్ లో వెంకీ నటించి మెప్పించాడు. ఇక మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ను మొదలుపెట్టింది వెంకటేషే. ఇక ఆయన సినిమాల్లో వల్గారిటీ ఉండదు.. బూతులు ఉండవు.. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమాలనే ఇప్పటివరకు వెంకీ మామ చేస్తూ వచ్చాడు. ఇక మొట్ట మొదటిసారి వెంకటేష్, తన అన్న కొడుకు రానా తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అదే రానానాయుడు. నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. కరణ్ అన్షుమాన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ మార్చి 10 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది.
ఇక ఈ ట్రైలర్ లో వెంకీ మామ క్రిమినల్ గా కనిపిస్తుండగా.. రానా పోలీస్ గా కనిపించాడు. మోట్ మొదటిసారి వెంకీ ఈ సిరీస్ లో బూతులు మాట్లాడాడు. సాధారణంగా బాలీవుడ్, నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ లు అంటే కొద్దిగా వల్గారిటీ ఉంటుంది. ఇందులో కూడా దాన్ని గుప్పించారు. వల్గారిటీ అంటే సీన్స్ మాత్రమే కాకుండా వెంకీ చేత కూడా జీ పదాలను చెప్పించారు. ట్రైలర్ లోనే వెంకీ రెండు మూడు సార్లు బూతు మాటలను మాట్లాడడం కనిపిస్తోంది. ఇక సిరీస్ లో అంతకు మించి చూపించబోతున్నట్లు అర్ధమవుతోంది. అయితే ఇక్కడే చిక్కు వచ్చి పడింది. ఎప్పుడు వెంకీని అభిమానులు ఈ రేంజ్ లో చూసింది లేదు, ఉహించుకున్నది లేదు. మొట్ట మొదటిసారి వెంకీ ఇలా బూతులు మాట్లాడడం పై వెంకీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంకీ ఇలా మాట్లాడుతుంటే వినలేకపోతున్నాం అని చెప్పుకొస్తున్నారు. మరి సిరీస్ రిలీజ్ అయ్యాక వెంకీని అభిమానులు ప్రశంసిస్తారో, విమర్శిస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
-
CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..