Veera Simha Reddy To Release On This Date: ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో రూపొందుతోన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘వీరసింహారెడ్డి’. అటు అఖండతో బాలయ్య, ఇటు క్రాక్‌తో గోపీచంద్ మలినేని తమ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. వారి కాంబోలో ఈ వీరసింహారెడ్డి తెరకెక్కుతుండడంతో.. అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఇక ఫస్ట్‌లుక్, టీజర్ వచ్చాక.. ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోని వెండితెరపై చూద్దామా అని అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు.
వీరసింహారెడ్డిని మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామని చెప్తూ వస్తున్నారు కానీ, ఏ రోజే అనేది రివీల్ చేయలేదు. అయితే, సినీ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాని జనవరి 14వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట! త్వరలోనే ఈ విషయమై మేకర్స్ నుంచి అధికార ప్రకటన వస్తుందని ఇన్‌సైడ్ న్యూస్. ఈ సినిమాని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. వాల్తేరు వీరయ్యని కూడా నిర్మిస్తున్నారు. ఈ రెండింటినీ సంక్రాంతికే తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. రెండింటినీ ఒకే రోజు కాకుండా, కనీసం ఒక రోజు గ్యాప్‌తో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ లెక్కన.. వాల్తేరు వీరయ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. అయితే.. ఈ రెండు విడుదల తేదీలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు.. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 19వ తేదీ నుంచి చివరి షెడ్యూల్ ప్లాన్ చేశారు. అందులో బాలయ్య కూడా పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తి కానుంది. కొన్ని రోజుల్లోనే ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసి.. పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రబృందం నిమగ్నం కానుంది. కాగా.. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.