Vedhika’s Suspense thriller “Fear” launched grandly with pooja ceremony: హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న “ఫియర్” మూవీని ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్న ఈ ఈ సినిమాకి సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తుండగా అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో నటుడు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ అందించగా…డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ నిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
Hanu Man: హనుమాన్ స్పెషల్ స్క్రీనింగ్‌కు బాలకృష్ణ.. ప్రశాంత్ వర్మపై ప్రశంసలు!
ఈ సందర్భంగా హీరోయిన్ వేదిక మాట్లాడుతూ ‘’ఫియర్ మూవీ షూటింగ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా, ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షనల్ గా ఉంటుంది. నేను తెలుగులో కాంచన, రూలర్ సినిమాల్లో నటించా, ఓ వెబ్ సిరీస్ చేశా. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కథలో నటించలేదు. డైరెక్టర్ హరిత గోగినేని ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ రెడీ చేశారు, ఈ కథ నాకు చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యా. స్టోరీ, క్యారెక్టర్స్ డిజైన్ లో హరిత చాలా క్లారిటీగా ఉన్నారు. కొత్త డైరెక్టర్ అని నాకు అనిపించ లేదు. దత్తాత్రేయ మీడియా సంస్థలో పనిచేయడం హ్యాపీగా ఉంది, అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ తో ఈ ఫియర్ మూవీ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా ‘’ అని చెప్పింది.