Varun Tej Promoting Operation Valentine aggressively: వరుణ్ తేజ్ హీరోగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే సినిమా తెరకెక్కింది. వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా మీద ఆయన చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడ్డ దర్శకత్వంలో ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి సందీప్ ముద్ద నిర్మిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు అలాగే ఏకకాలంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సోలో రిలీజ్ డేట్స్ సర్దుబాట్లలో ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మార్చి ఒకటికి వాయిదా పడింది. ఆ వాయిదా పడిన కాలాన్ని కూడా సినిమా ప్రమోషన్స్ ను మరింత అగ్రెసివ్ గా చేసేందుకు వరుణ్ తేజ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ వందేమాతరం అనే సాంగ్ ని వాఘా – అటారి బోర్డర్లో రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు ఆయన. ఇక ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రియల్ లైఫ్ వింగ్ కమాండర్ తో ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసి దాన్ని మీడియాకి రిలీజ్ చేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
Subhaleka Sudhakar: శైలజతో విడాకులు… ఆ తెల్లారి అమ్మ చనిపోయింది
ఇక ఆ తర్వాత సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ ఒక హైదరాబాద్ కాలేజీలో లాంచ్ చేసి యూత్ అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే వరుణ్ తేజ్ మరో ఆసక్తికరమైన అంశంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. నిజానికి ఫిబ్రవరి 14 అనగానే ప్రపంచం అందరికీ వాలెంటైన్స్ డే గుర్తొస్తే భారతీయులకు మాత్రం పుల్వామాలో జరిగిన మారణకాండ గుర్తొస్తుంది. పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించిన సంగతి ఎవరూ మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు పుల్వామా మెమోరియల్ సైట్ ను టీంతో కలిసి సందర్శించారు వరుణ్ తేజ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను, ఫోర్స్ ఆఫీసర్లను సినిమాలో భాగస్వాములుగా చేస్తూ చేసిన ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించగా రుహనీ శర్మ మరో కీలక పాత్రలో నటించింది. మామూలుగానే వరుణ్ తేజ్ అంటే ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుని ముందుకు వెళ్తాడు. అయితే తన తొలి బాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ కావడంతో పాటు దేశ భక్తిని చాటుకునే సినిమా కావడంతో వరుణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడాతగ్గేదే లేదన్నట్టు తన 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి దూసుకుపోతున్నాడు.