Michael యంగ్ హ్యాండ్సమ్ యాక్టర్ సందీప్ కిషన్ నెక్స్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా తారాగణంతో మరో యంగ్ హీరో చేరిపోయాడు. టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ వరుణ్ సందేశ్ Michael లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుతో వరుణ్ సందేశ్ మరోమారు పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.
Read Also : Radhe Shyam : గడ్డకట్టించే చలిలో పూజా, ప్రభాస్ కష్టాలు !
Michael లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరైన వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. Michael కొత్త షెడ్యూల్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మించిన ఈ చిత్రంలోని ఇతర తారాగణం, సిబ్బందిని త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.