Varalaxmi Sarath Kumar Strong Comments on Trollers: మే మూడో తేదీన శబరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టారు మేకర్స్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా గురించి నెటిజెన్ల గురించి వరలక్ష్మి శరత్ కుమార్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో ఒక రిపోర్టర్ గతంలో సోషల్ మీడియా ఇంత విరివిగా అందుబాటు లేని సమయంలో నటీనటులు అభిమానులతో లేదా ఆడియన్స్ తో నేరుగా ఇంటరాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు ఉన్నట్టుగా పూర్తి నెగెటివిటీ లేదా పూర్తి పాజిటివిటీ ఉండేది కాదు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి మీరేం చెబుతారు అని అడిగితే ఆ టైంలో బెటర్ విషయం ఏమిటంటే పూర్తిగా నచ్చిందా లేదా అనేది అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే జనాల్లో గుంపుగా మాట్లాడుతూ ఉండేవారు.
Varalaxmi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న రిపోర్టర్… వరలక్ష్మీ షాకింగ్ రిప్లై
కాబట్టి ఒకరి ఒపీనియన్ ఏమిటి అనే విషయం మీద పూర్తిగా అవగాహన వచ్చేది కాదు. ఆ రోజుల్లో నేరుగా ముఖం మీద మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నచ్చలేదు అని ఎవరూ చెప్పేవారు కాదు ఎందుకంటే నేరుగా మనిషి ఎదురుపడినప్పుడు సినిమా నచ్చకపోయినా నచ్చింది అనే చెబుతారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పడానికి అలవాటు పడిపోయారు. ఈ రోజుల్లో నెగిటివిటీకి క్రేజ్ పెరిగిపోయింది. ఏదైనా విషయం నెగిటివ్గా చెప్తేనే లైక్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే హానెస్ట్ గా ఉండటం వేరే పద్ధతి. చెప్పే విధానంలో నెగిటివ్గా చెబుతున్నారా హానెస్ట్ గా చెబుతున్నారా అనేది అర్థం అయిపోతుంది అని ఆమె అన్నారు. కావాలని నెగిటివ్గా చెప్పి హానెస్ట్ గా చెప్పా అనే వాళ్ళు కూడా ఉంటారు కానీ అదే విషయం వాళ్ళ అమ్మ గురించో చెల్లి గురించి చెబితే చెప్పుతీసుకొని కొట్టడానికి కూడా రెడీ అవుతారు. ముఖం లేకుండా, ఇతరుల లైఫ్ మీద వాల్యూ లేకుండా, కామెంట్ చేయడానికి మీరు ఎవరు? మీరేం సాధించారు? ఒక పది మంది మిమ్మల్ని గుర్తు పడతారా? ఏమైనా సాధించారా? అని ఆమె ప్రశ్నించారు. నేను ఈ నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ అస్సలు పట్టించుకోను అని ఆమె అన్నారు.